: 10 రోజుల్లో సచివాలయం ఖాళీ చేయాలంటూ టీఎస్ ప్రభుత్వం ఆదేశాలు


తెలంగాణ సచివాలయం మొత్తాన్ని ఖాళీ చేయాలంటూ టీఎస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం 10 రోజుల డెడ్ లైన్ విధించింది. అంతేకాదు, 9 మంది ఐఏఎస్ లకు సచివాలయం తరలింపు బాధ్యతలను అప్పగించింది. కాసేపటి క్రితం వివిధ శాఖల కార్యదర్శులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం సూచించిన భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యాలయాల వారిగా చూస్తే, మున్సిపల్ కార్యాలయాన్ని డీటీసీటీ ఆఫీసుకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, అటవీశాఖ, బీసీ సంక్షేమం, ఇరిగేషన్, హౌసింగ్ శాఖలను వాటి ప్రధాన కార్యాలయాల్లోకి మార్చాలని, మిగిలిన శాఖలను పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోకి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News