: మాల్టా ఎయిర్‌ పోర్ట్‌ రన్ వే పై పేలిన విమానం...విమానాశ్రయం మూసివేత


రన్ వేపై విమానం పేలిన ఘటన కలకం రేపుతోంది. మ‌ధ్య‌ద‌రా స‌ముద్రంలోని మాల్టా దీవిలోని లుక్వా ఎయిర్‌ పోర్ట్‌ లో ర‌న్‌ వేపై విమానం టేకాఫ్ తీసుకుంటున్న స‌మ‌యంలో స‌డ‌న్‌ గా పేలిపోయిందని ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. భారీ శబ్దం చేస్తూ విమానం పేలిపోయిందని, దీంతో ఈ విమానంలో ఉన్న ఐదుగురు ఫ్రెంచ్ సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందారని అధికారులు వెల్ల‌డించారు. దీంతో వెంటనే మాల్టా ఎయిర్‌ పోర్ట్‌ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. విమానాశ్ర‌యం సాధార‌ణ స్థితికి రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుందని వారు తెలిపారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విమానం ఎందుకు పేలిపోయిందనే దానిపై ఆరాతీయనున్నారు.

  • Loading...

More Telugu News