: ఇంగ్లండ్ జర్నలిస్టుకు మరోసారి సెటైర్ వేసిన సెహ్వాగ్
రియో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన భారత్ ఎందుకు అంతలా సంబరాలు చేసుకుంటోందో అర్థం కాలేదని ఎద్దేవా చేసిన ఇంగ్లండ్ జర్నలిస్టు మోర్గాన్ పై టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సెటైర్ వేశాడు. కబడ్డీ జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అనంతరం మోర్గాన్ ను ఉద్దేశిస్తూ... 'కబడ్డీ పుట్టిల్లు భారత్...చూశారా! వరుసగా వరల్డ్ కప్ లు గెలుచుకుంటోంది. క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ ఇప్పటికి ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలుచుకోలేదు' అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో షాక్ తిన్న మోర్గాన్, తేరుకుని 'నిజం చెప్పాలంటే కబడ్డీ ఒక క్రీడ కాదు. బలమైన ఆటగాళ్లు వేదికపై అటూ ఇటూ తిరుగుతూ కొట్టుకునేది' అంటూ సమాధానమిచ్చాడు.