: మన జనాభా తగ్గుతోంది.. హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలి: ఎంపీ గిరిరాజ్ సింగ్


మన దేశంలో ‘హిందూ’ జనాభా మరింతగా పెరగాల్సిన అవసరం చాలా ఉందని, ఈ విషయమై హిందువులు తీవ్రంగా ఆలోచించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ అన్నారు. మన దేశంలోని 8 రాష్ట్రాల్లో హిందువుల జనాభా తగ్గిపోతోందని, ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాలని అన్నారు. హిందువులు మరింత మంది పిల్లల్ని కనే విషయమై ఎటువంటి చట్టాలు అడ్డురావని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గత ఆగస్టులో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 1947 నుంచి చూస్తే మన దేశంలో ముస్లింల జనాభా 10 శాతం నుంచి 24 శాతానికి పెరిగిందన్నారు. అదే సమయంలో ‘హిందూ’ జనాభా 90 శాతం నుంచి 76 శాతానికి తగ్గిందన్నారు. కొన్ని జిల్లాల్లో ముస్లింల సంఖ్య ఒక స్థాయిలో ఉందని, వారిని ‘మైనార్టీ’ల కింద పరిగణిస్తున్న విషయాన్ని సమీక్షించాల్సిన అవసరముందని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News