: బాలీవుడ్ యువనటుడికి ధన్యవాదాలు చెప్పిన రాజమౌళి
బాలీవుడ్ యువనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. తన కుమార్తెను కలిసినందుకు ధన్యవాదాలన్నాడు. 'మిమ్మల్ని కలవడం పట్ల మా కుమార్తె చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మీరిచ్చిన సలహాకు ధన్యవాదాలు...' అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. దానికి సమాధానమిచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రా.. 'హలో సర్...నేను మీకు పెద్ద ఫ్యాన్ ని, ధ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చాలా చక్కగా మాట్లాడింది. ఈ సారి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తానని భావిస్తున్నా'నని తెలిపాడు. వీరిద్దరి ట్విట్టర్ టాక్ వారి అభిమానులను ఆకట్టుకుంది.