: రూ.4,444 ధరతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన స్వైప్ టెక్నాలజీస్
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ స్వైప్ టెక్నాలజీస్ నుంచి మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ‘స్వైప్ ఎలైట్ 2 ప్లస్’ పేరుతో తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,444గా సదరు కంపెనీ పేర్కొంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సిమ్ సదుపాయం ఉంది. దీని ఫీచర్‌లు.. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 అంగుళాల స్క్రీన్, 1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 1 జీబీ అంతర్గత మెమొరి, 8 జీబీ స్టోరేజీ, 5 మెగాపిక్సెల్ బ్యాక్, 2 మెగా పిక్సెల్ ఫ్రెంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంగా ఉన్నాయి.