: రెండు రోజుల్లో అఖిలేష్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మాయావతి
యూపీలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో అఖిలేష్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. యూపీని సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) భ్రష్టు పట్టించిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎస్పీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాయావతి మండిపడ్డారు. కాగా, కుటుంబ రాజకీయాల కారణంగా ఎస్పీలో చీలికలు ఏర్పడ్డాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీపై యూపీలో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.