: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిన సినీ నటి ఖుష్బూ
అనారోగ్యంతో బాధపడుతూ నెల రోజుల నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సినీ నటి ఖుష్బూ కలిశారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాను అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను చూసి వచ్చినట్లు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యం బావుందని ఆమె చెప్పారు. ఆమె మరింత త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రానున్న దీపావళి పండుగను జయలలిత ప్రజలతో కలిసి జరుపుకోవాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.