: మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో అత్యవసర పిటిషన్... మధ్యాహ్నం విచారణ
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో కొనసాగిన ఎన్ కౌంటర్ లో 23 మంది మావోలు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ ను సవాల్ చేస్తూ పౌరహక్కుల నేతలు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఈ మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఈ సందర్భంగా విరసం నేత వరవరరావు మాట్లాడుతూ, ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరచాలని డిమాండ్ చేశారు. వారి బంధువులు వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదని అన్నారు. జాతీయ మానవ హక్కుల సంస్థ నిబంధనల మేరకే పోస్ట్ మార్టం నిర్వహించాలని కోరారు.