: స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో సాయిబాబా భక్తుల నినాదాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ భూతాన్ని భక్తులు పూజిస్తున్నారంటూ షిర్డి సాయిబాబాను ఉద్దేశించి ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ సాయిబాబా భక్తులు నినాదాలు చేస్తున్నారు. తమను చర్చలకు పిలిస్తే స్వరూపానంద నోరు మూయిస్తామని దేవస్థాన పెద్దలు సవాలు విసురుతున్నారు. స్వరూపానందకు భూతం పట్టిందని అన్నారు. దమ్ముంటే చర్చలకు రావాలని అన్నారు. సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదిలేదని సాయి భక్తులు హెచ్చరిస్తున్నారు. సాయిబాబాను దెయ్యం, భూతం అంటూ తమను స్వరూపానంద రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.