: తమిళనాడు గవర్నర్ గా విద్యాసాగర్ రావుకే పూర్తి బాధ్యతలు?


మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే, టీఎస్ గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీకాలం ముగియడంతో... ఇంఛార్జ్ గా విద్యాసాగర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత, పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాల్సి ఉండటంతో, కేంద్రం పలువురి పేర్లను పరిశీలించింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు దాదాపు ఖరారయినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, ఢిల్లీలో తాజాగా కొత్త కసరత్తులు జరుగుతున్నట్టు సమాచారం. తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించడం కన్నా, విద్యాసాగర్ రావుకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తే మేలనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు, విద్యాసాగర్ రావుకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్టే అని తమిళనాడు మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా, చెన్నైలోని రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. గవర్నర్ పేరుకు ముందు సాధారణంగా వాడే 'హిజ్ ఎక్సలెన్సీ' అనే పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని... 'గవర్నర్ గారు' అని సంబోధిస్తే చాలనేది ఆ ప్రకటన సారాంశం. దీంతో, రాజ్ భవన్ నుంచి పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అర్థమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News