: ఏవోబీలో పోలీసుల భారీ ఆపరేషన్.. 15 మంది మావోయిస్టుల మృతి?
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 15 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. కూంబింగ్‌లో ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. పోలీసుల కాల్పుల్లో 15 మంది వరకు మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయమై మరింత సమాచారం అందాల్సి ఉంది.