: మళ్లీ కాల్పులకు తెగబడిన పాకిస్థాన్.. అమరుడైన బీఎస్ఎఫ్ జవాను


కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. జమ్ముకశ్మీర్‌లో ఆదివారం రాత్రి నుంచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అఖ్నూర్ సెక్టార్‌లో యథేచ్ఛగా కాల్పులు జరుపుతోంది. 20 బీఎస్ఎఫ్, 5 ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు ఆగకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ అమరుడయ్యాడు. మరో బీఎస్ఎఫ్ జవాను, ఓ పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన భారత దళాలు పాక్‌కు దీటుగా బదులిస్తున్నాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News