: నెల్లూరులో కానిస్టేబుల్ అరాచకం.. ప్రేమ జంటల ఫొటోలు తీసి బెదిరింపులు.. ఆపై అత్యాచారం!


నెల్లూరులో ఓ కానిస్టేబుల్ చేసిన అరాచకాలు బయటపడుతున్నాయి. 6వ నగర్ పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్ గోపీ అఘాయిత్యాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను గుర్తించి రహస్యంగా ఫొటోలు తీసి తర్వాత వాటిని చూపి బెదిరింపులకు దిగేవాడు. అంతేకాదు, ఆ ఫొటోలను చూపించి పలువురు యువతులపై అత్యాచారం కూడా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపీ ఘోరాలపై ఓ వైద్య విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు గోపీని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News