: షిర్డి సాయిపై మళ్లీ స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు.. మండిపడ్డ సాయిభక్తులు
షిర్డి సాయిబాబాను ఉద్దేశించి ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని లలితకళా తోరణంలో నిర్వహిస్తున్న ‘గురువందనమ్’ కార్యక్రమంలో స్వరూపానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణలో ప్రతి ఇంట్లో సాయి పేరిట ఒక భూతాన్ని పూజిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సాయిని దేవుడంటూ మమ్మల్ని మూర్ఖుల్ని చేయకండి. సంతోషిమాత వచ్చేసింది, వినాయకుడు పాలు తాగుతున్నాడన్న నమ్మకాలతో సనాతన ధర్మం పరువు తీయకండి’ అంటూ స్వరూపానంద వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సాయిభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సాయిభక్తులను పోలీసులు అరెస్టు చేశారు.