: మూడో వన్డేలో ధోనీ అర్ధశతకం.. స్కోరు 154/2
మొహాలీలో జరుగుతున్న మూడో వన్డేలో ధోనీ, కోహ్లీల భాగస్వామ్యం కొనసాగుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ఇప్పటివరకు 73 బంతులు ఆడిన ధోనీ 68 పరుగులు చేయగా, 70 బంతులు ఆడిన కోహ్లి 62 పరుగులు చేసి కొనసాగుతున్నారు. కోహ్లి 6 ఫోర్లు, ధోనీ 5 ఫోర్లు, 3 సిక్స్ లు బాదారు.