: కాపు ద్రోహి ముద్రగడ ఉద్యమం అర్థం లేనిది: చినరాజప్ప


ముద్రగడ ఉద్యమం అర్థం లేనిదని, ఉనికి కోసమే ఆ ఉద్యమం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ముద్రగడ కాపు ద్రోహి అని, కాపులకు ఇప్పుడున్న గుర్తింపు ఎప్పుడూ లేదని అన్నారు. కాపుల్ని బీసీల్లో చేర్చి తీరుతామని అన్నారు. బీసీలకు ఇబ్బంది లేకుండా, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమయ్యే పనేనని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ ముఖ్యమంత్రీ కూడా గతంలో చెప్పలేదని, కేవలం చంద్రబాబు ఒక్కరే ఆ విధంగా హామీ ఇచ్చి, ఆ దిశగా వెళుతున్నారని చినరాజప్ప అన్నారు.

  • Loading...

More Telugu News