: కరీంనగర్ జిల్లా టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత


కరీంనగర్ జిల్లా టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇన్నేళ్లు అయినప్పటికీ, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం లేదంటూ మానకొండూరు నియోజకవర్గ ఇన్ చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పదవుల కోసమే కాకుండా, పార్టీ పటిష్టత కోసం కూడా పోరాడాలని జిల్లా నేతలను ఉద్దేశించి ఆయన అనడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో, టీడీపీ అధ్యక్షుడు ఆగయ్య, సత్యనారాయణ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కల్పించుకుని వారికి సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News