: బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనే నేను ఎదిగాను: కేసీఆర్


బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనే తాను ఎదిగానని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో 12 ఎకరాల్లో బ్రాహ్మణ సదన్ ను ఏర్పాటు చేస్తామని, దీని వేదికగా బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు చేపడతామని అన్నారు. బ్రాహ్మణులకు ఇప్పటికే బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించామని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తాము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News