: మన సైనికులను ముట్టుకోవాలని చూస్తే పాక్ తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు: భారత్ ఆర్మీ


మన సైనికులను ముట్టుకోవాలని చూస్తే పాక్ తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని భారత్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ ను భారత సైన్యం ఈరోజు తీవ్రంగా హెచ్చరించింది. కాగా, పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడిన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. జమ్మూలోని బీఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ఈరోజు గుర్నామ్ సింగ్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్ సైన్యం ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కనుక దానిని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News