: బాలకృష్ణ, ఆయన పీఏపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త తీవ్ర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణపైన, ఆయన పీఏ పైన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ అని బాలకృష్ణ అనుకుంటున్నారని విమర్శించారు. నెలలో ఒక రోజు మాత్రం తన నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారని, హిందూపురంలో బాలకృష్ణ పీఏ అవినీతి పెరిగిపోతోందని నవీన్ నిశ్చల్ ఆరోపించారు.