: అనసూయకు, నాకు మధ్య ఎటువంటి పోటీ లేదు: ‘జబర్దస్త్’ రష్మీ
అనసూయకు, తనకు మధ్య ఎటువంటి పోటీ లేదని ‘జబర్దస్త్’ ఫేం రష్మీ చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘జబర్దస్త్’ కు సంబంధించి తమ మధ్య ఎటువంటి పోటీ లేదని, ఎవరి తీరు వారిదేనని అన్నారు. అయితే, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం కాదని, ఆమె జీవితం, లక్ష్యాలు వేరని; తన జీవితం, లక్ష్యాలు వేరని, వర్క్ పరంగా పనిచేసే విధానం కూడా తమది డిఫరెంట్ గా ఉంటుందని రేష్మీ చెప్పింది. ఈ సందర్భంగా ‘సుడిగాలి సుధీర్ కు వార్నింగ్ ఇచ్చారా?’ అనే ప్రశ్నకు రేష్మీ సమాధానమిస్తూ.. అటువంటి దేమీ లేదని, అదంతా ‘షో’లో భాగంగా జరిగిందేనని చెప్పుకొచ్చింది.