: ఐసీసీని మేమడిగింది ప్రత్యేక ఫండ్.. రుణం కాదు: పాక్ క్రికెట్ బోర్డు
ఐసీసీని తాము కోరింది ప్రత్యేక ఫండ్ అనీ, రుణం మాత్రం కాదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొంది. తమకు రుణాన్ని ఇస్తామంటూ ఐసీసీ ముందుకొచ్చిన విషయాన్ని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నథామ్ సేథీ ఈ సందర్భంగా వెల్లడించారు. తాము ఎప్పుడూ ఐసీసీ నుంచి చేబదులు కానీ, రుణాల్ని కానీ కోరలేదని, ఒక ప్రత్యేక ఫండ్ మాత్రమే ఇవ్వమని అడిగామని అన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో ద్వైపాక్షిక సిరీస్ కు అంగీకరించే వరకే ఈ ప్రత్యేక ఫండ్ ఇవ్వమని కోరామన్నారు. 2007 నుంచి తమ దేశంలో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ జరగనందున నష్టపోయామని, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఐసీసీ ఆదుకోవాలని, అది తమ హక్కు అని అన్నారు. కొంత మేరకు ఇచ్చే రుణం తమకు వద్దని నథీమ్ సేథీ చెప్పారు.