: దేశ రక్షణలో తన ప్రాణాలు పోతే బాధపడవద్దని నా కొడుకు చెప్పాడు: వీర జవాన్ గుర్నమ్ సింగ్ తల్లి
దేశ రక్షణలో కనుక ప్రాణాలు పోతే బాధపడవద్దని తన కొడుకు చెప్పాడని, అందుకే తాను ఏడవటం లేదని వీర జవాన్ గుర్నమ్ సింగ్ తల్లి జశ్వంత్ కౌర్ అన్నారు. జమ్మూకాశ్మీర్ లోని హిరనగర్ సెక్టార్ లో పాక్ రేంజర్ల కాల్పుల్లో గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాన్ గుర్నమ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన జవాన్లను చూసి తాను ఎంతో గర్విస్తున్నానని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గుర్నమ్ సింగ్ తండ్రి గుల్బీర్ సింగ్ మాట్లాడుతూ, గాయపడ్డ తన కుమారుడిని బక్షినగర్ ఆసుపత్రిలో చేర్పించారని, బీఎస్ఎఫ్ కు కనుక సొంత ఆసుపత్రి ఉంటే తన కొడుకును కాపాడగలిగేవారని అన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీకి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని.. మన దేశ జవాన్ల కోసం మంచి ఆసుపత్రి ఉంటే బాగుంటుందని అన్నారు.