: మళ్లీ టాస్ మనదే... మళ్లీ ఫీల్డింగే చేస్తామన్న ధోనీ
మొహలీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్, తొలి రెండు మ్యాచ్ లలో మాదిరిగానే ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. ఈ సిరిస్ లో ఇప్పటివరకూ ఇండియా టాస్ ఓడిపోవడమన్నది జరగలేదు. ఈ మ్యాచ్ లో కూడా టాస్ ఇండియానే వరించింది. తొలి రెండు మ్యాచ్ లలో తొలుత ఫీల్డింగ్ చేయాలని ఎంచుకున్న భారత్, మొదటి మ్యాచ్ లో విజయం సాధించి, ఆపై రెండో మ్యాచ్ లో స్వల్ప తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ గెలుపుతో అదే ఊపును చూపించాలని న్యూజిలాండ్ భావిస్తుండగా, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో ఆధిక్యత సాధించాలని ఇండియా కృత నిశ్చయంతో ఉంది.