: పాస్ వర్డ్ లు మార్చుకోకపోవడంతోనే ఇంత రభస: ఎస్బీఐ


డెబిట్ కార్డుల పాస్ వర్డ్ లను మార్చుకోవాల్సిందిగా పదే పదే తాము చెబుతున్నప్పటికీ, పట్టించుకోని వారిలో కొద్ది మంది కార్డుల వివరాలు మాత్రమే బయటకు వెళ్లాయని ఇండియాలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెంగాల్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా వ్యాఖ్యానించారు. పాస్ వర్డ్ లు మారని కార్డుల నుంచి మాత్రమే తప్పుడు లావాదేవీలు జరిగాయని తాము గుర్తించామని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాదారులు సాధ్యమైనంత వరకూ ఎస్బీఐ ఏటీఎంలను మాత్రమే వాడాలని ఇప్పటికే సూచించామని గుర్తు చేసిన ఆయన, సెక్యూరిటీ లోపాలున్న ఆరు లక్షల కార్డులను మార్చే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. ప్రతి ఖాతాకు చెందిన అన్ని లావాదేవీలనూ పరిశీలిస్తున్నామని, అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే, ఆ కార్డులను బ్లాక్ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News