: 'ఎద్దేడ్చిన ఎవుసం నడువది... రైతేడ్జిన రాజ్యం నడువది'... కేసీఆర్ కు కోదండరామ్ డిమాండ్లివే!


'ఎద్దేడ్చిన ఎవుసం నడువది... రైతేడ్జిన రాజ్యం నడువది' అంటూ ఈ ఉదయం రైతు దీక్షను ప్రారంభించిన జేఏసీ చైర్మన్ కోదండరామ్, కేసీఆర్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలుపగా, వర్షాలు, నకిలీ విత్తనాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని ఆరోపించిన ఆయన, వెంటనే రైతులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని కోదండరామ్ కోరారు. భూమి, నీటిపై రైతుల హక్కులు కాలరాచే నిర్ణయాలు కూడదని, బలవంతపు భూ సేకరణ వద్దని, జీవో 123ని తాను వ్యతిరేకిస్తున్నానని కోదండరామ్ చెప్పారు. వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలను ఇప్పించాలని, రైతు ఆత్మహత్యలేలేని తెలంగాణ కోసమే తాను ఈ దీక్ష చేపట్టానని వివరించారు. ఈ రైతు దీక్షలో విద్యా వేత్త చుక్కా రామయ్య కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News