: మోదీ కీలక నిర్ణయం... సమావేశాలకు వచ్చే మంత్రుల సెల్ ఫోన్లపై నిషేధం
కేంద్ర మంత్రివర్గ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, అధికారులెవరూ సెల్ ఫోన్లను తీసుకురాకుండా నిషేధం విధిస్తున్నట్టు నిర్ణయం వెలువడింది. ఈ సమావేశాలకు వచ్చే వారి స్మార్ట్ ఫోన్లను హ్యాకర్లు హ్యాక్ చేసి, రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చన్న ఆలోచనతో పాటు, సమావేశాల్లో చర్చించే సున్నితమైన అంశాలకు సంబంధించిన వివరాలను తస్కరించే అవకాశం ఉన్నందున నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రుల ప్రైవేటు కార్యదర్శులకు ఆదేశాలు పంపుతూ, వారెవరూ సమావేశాలకు సెల్‌ఫోన్లు తీసుకురాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.