: తన మాటలను ప్రజలు నమ్మడం లేదని బొత్స, అంబటిలతో మాట్లాడిస్తున్న జగన్: చినరాజప్ప నిప్పులు
తాను విమర్శిస్తే, ప్రజలు నమ్మడం లేదన్న నిజం తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, తాను చేయాలనుకుంటున్న విమర్శలను బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులతో చేయిస్తూ, కుహనా రాజకీయాలు నడుపుతున్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, లోకేష్, తానూ మాట్లాడిన మాటల వీడియోను బయట పెట్టినప్పటికీ, వారి అసత్య ప్రచారం ఆగలేదని విమర్శించారు. తాను తెలుగుదేశం పార్టీలో ఓ కుటుంబ సభ్యుడినని, చంద్రబాబు తనను సొంత సోదరుడిలా చూసుకుంటారని వ్యాఖ్యానించిన చినరాజప్ప, సాక్షి పత్రికలో వస్తున్న వార్తలన్నీ తప్పుడు వార్తలేనని అన్నారు. బొత్స, అంబటి చేస్తున్న విమర్శలను సైతం ప్రజలు నమ్మని రోజులు వచ్చేశాయని అన్నారు.