: ఐశ్వర్య, రణబీర్ రొమాన్స్ సీన్లను సెన్సార్ కట్ చేయలేదు: కరణ్ జొహార్
తన తాజా చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్'లో రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్ మధ్య ఉన్న హాట్ రొమాన్స్ సీన్లను సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు వచ్చిన వార్తలను చిత్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్ తోసిపుచ్చాడు. ఈ సన్నివేశాలను సెన్సార్ తొలగించలేదని జియో ఫెస్టివల్ లో సినిమా హీరోయిన్లు ఐశ్వర్య, అనుష్కా శర్మలతో కలసి పాల్గొన్న కరణ్ స్పష్టం చేశాడు. చిత్రంలోని సారాంశాన్ని సెన్సార్ సభ్యులు అర్థం చేసుకున్నారని, అందువల్ల ఎలాంటి అభ్యంతరాలనూ చెప్పలేదని, ట్రైలర్ లో చూపిన అన్ని దృశ్యాలూ సినిమాలో ఉంటాయని అన్నాడు. పాత్రకు అనుగుణంగానే ఐశ్వర్యారాయ్ నటించిందని, ఆమె తన కళ్లతో ఎన్నో భావాలను చూపించిందని కరణ్ కితాబిచ్చాడు.