: రూ. 5.5 లక్షల కోట్లతో టైమ్ వార్నర్ ను కొనుగోలు చేస్తున్న ఏటీ అండ్ టీ


ప్రపంచ మీడియా రంగంలో అతిపెద్ద కంపెనీగా అవతరించేందుకు ఉరుకులు పెడుతున్న ఏటీ అండ్ టీ, మీడియా దిగ్గజం టైమ్ వార్నర్ ను రూ. 5.5 లక్షల కోట్లు (85 బిలియన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే హెచ్బీఓ, సీఎన్ఎన్, వార్నర్ బ్రదర్స్ తదితర మీడియా సంస్థలను కలిపేసుకున్న ఏటీ అండ్ టీ, ఈ డీల్ తో ప్రపంచంలోని పెద్ద మీడియా, ఇంటర్నెట్‌ సంస్థగా అవతరించనుంది. కొనుగోలుకు ప్రాథమికంగా అంగీకరించామని, నేడో, రేపో డీల్ పై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఏటీ అండ్ టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, గత సంవత్సరం వరకూ వైర్ లెస్ ఫోన్లు, బ్రాడ్ బ్యాండ్ సేవలందిస్తూ వచ్చిన ఏటీ అండ్ టీ, 48.5 బిలియన్ డాలర్లతో శాటిలైట్ టీవీ సేవల సంస్థ 'డైరెక్ట్ టీవీ'ని గత సంవత్సరం కొనుగోలు చేసి మీడియా రంగంలో కాలు మోపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News