: దేశంలోని ఏకైక ప్రైవేటు రైల్వే లైన్ 'శకుంతల'... టేకోవర్ చేసుకోనున్న మోదీ సర్కారు


దేశంలో వేళ్లపై లెక్కించేన్ని నారో గేజ్ రైల్వే రూట్లలో ఒకటిగా, ఏకైక ప్రైవేటు లైన్ గా ఉన్న శకుంతల రైల్వేను భారత రైల్వే విలీనం చేసుకోనుంది. బ్రిటీషు వారి హయాంలో కిల్లిక్ నిక్సన్ అనే కంపెనీ నిధులతో 1910లో ది సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (ది శకుంతలా రైల్వే) నిర్మించిన ఈ లైన్ ఇప్పటివరకూ భారత రైల్వేల్లో కలవకుండా విడిగానే ఉంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో అవాత్మాల్ నుంచి అచల్ పూర్ వరకూ 188 కిలోమీటర్ల దూరం ఈ నారోగేజ్ లైన్ ఉంది. ఇక దీన్ని రైల్వే శాఖలో కలిపేందుకు మోదీ సర్కారు నిర్ణయించగా, ఈ ప్రతిపాదనలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆమోదం పలికారు. ఈ నారో గేజ్ లైన్ ను రూ. 1,500 కోట్లతో బ్రాడ్ గేజ్ గా మార్చాలన్నది రైల్వే శాఖ నిర్ణయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News