: ఏ మేరకు గెలుస్తాడో కానీ... అధ్యక్షుడిగా 100 రోజుల ప్రణాళికను చెప్పేసిన ట్రంప్


చుట్టుముట్టిన లైంగికారోపణలు ట్రంప్ ను అమెరికా అధ్యక్ష పీఠానికి దూరం చేశాయని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ, గెలిచేది తానేనని చెప్పుకున్న ట్రంప్, అధ్యక్షుడిగా తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేశారు. పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్ లో మాట్లాడిన ఆయన, తనకు, అమెరికన్లకు మధ్య ఓ కాంట్రాక్టు కుదరాల్సి వుందని, తొలి 100 రోజుల్లో తాను అధ్యక్షుడిగా వాషింగ్టన్ ను, వైట్ హౌస్ ను శుద్ధి చేస్తానని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, తన ప్రత్యర్థి హిల్లరీ అమెరికా మారాలని కోరుకోవడం లేదని, తన విజయంతో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. తొలి వంద రోజుల్లో వలస వస్తున్న వారిని అడ్డుకుని తీరుతానని, సరిహద్దులను మరింత పటిష్ఠం చేస్తానని, ప్రభుత్వంలో నిజాయతీని పెంచుతానని అన్నారు. నవంబర్ 8న అమెరికన్లు ఈ 100 రోజుల ప్రణాళిక అమలు కోసం తనకు ఓటేయాలని కోరారు.

  • Loading...

More Telugu News