: జయమ్మ ఆరోగ్యం కోసం పూజలు... రూ. 8 కోట్లకు కుండల వ్యాపారం!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంగా ఉన్న వేళ, రాష్ట్రంలో మట్టి కుండల వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని కుండలు చాలక కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గడచిన నాలుగు వారాల వ్యవధిలో రూ. 8 కోట్ల మేరకు కుండల వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. జయలలిత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అన్నాడీఎంకే నేతలు తమ స్థాయికి తగ్గట్టు పూజలు జరిపిస్తుండటమే కుండలకు డిమాండ్ పెంచింది. తమ పదవిని బట్టి 108, 508, 1008 కుండలను కొనుగోలు చేసి, వాటిని పాలతో నింపుతూ ప్రదర్శనలు చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తుండగా, మంత్రుల స్థాయిలో ఉన్నవారు ఏకంగా వేల సంఖ్యలో స్టీలు బిందెలను కోనేస్తుండడం గమనార్హం. ఓ మంత్రి 5 వేల బిందెలకు ఆర్డర్ ఇవ్వగా, తమ వద్ద 3 వేలు మాత్రమే ఉండటంతో కుంభకోణం నుంచి అదనపు బిందెలను తెప్పించామని పాత్రల దుకాణం వ్యాపారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ రాఘవన్ అన్నారు. అకస్మాత్తుగా వీటికి డిమాండ్ పెరగడంతో అందుకు తగ్గట్టు తయారీని చేపట్టలేకపోతున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News