: ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్... 'సాహోరే బాహుబలి'!


హీరో ప్రభాస్ పుట్టిన రోజు బహుమతిగా విడుదలైన 'బాహుబలి: ది కన్ క్లూజన్' మోషన్ పోస్టర్ సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రాజమౌళి పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. "భళి భళి భళిరా భళి... సాహోరే బాహుబలి" అంటూ సాగుతుందీ పాట. యూట్యూబ్ లో ఈ మోషన్ పోస్టర్ వీడియోను నిన్న అప్ లోడ్ చేయగా, ఇప్పటివరకూ 2.70 లక్షల మంది చూశారు. 14 సంవత్సరాల క్రితం 'ఈశ్వర్' చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 'వర్షం'తో స్టార్ గా మారిన ప్రభాస్ కు బాహుబలి అతిపెద్ద విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News