: భవిష్యత్ నగరాలకు అమరావతి రోల్ మోడల్ అవుతుంది.. చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ఏడాదిలోనే ఎంతో ప్రగతి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి శంకుస్థాపన చేసి శనివారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘అమరావతికి శంకుస్థాపన చేసి నేటికి ఏడాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రగతి సాధించాం. ఇప్పటి నుంచి దాని వేగం మరింత పుంజుకుంటుంది. ప్రపంచంలోని భవిష్యత్ నగరాలకు అమరావతి నమూనా రాజధానిగా నిలుస్తుంది. కలిసికట్టుగా అద్భుతంగా ఈ నగరాన్ని నిర్మించుకుందాం’’ అని సీఎం ట్వీట్ చేశారు. అమరావతికి శంకుస్థాపన చేశాక గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News