: హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్టు గుట్టు రట్టు...పట్టుబడ్డ నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్


హైదరాబాదులోని జీడిమెట్లలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ఈ డ్రగ్స్ రాకెట్ ను సినీ నిర్మాత వెంకట సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్ నడపడం విశేషం. వారు తరలిస్తున్న కేజీన్నర యాంటిఫిటమైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై యాంటీ డ్రగ్ ట్రాపికింగ్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్ కు పంపించారు. డ్రగ్స్ రాకెట్ తో మరోసారి సినీ పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధాలు వెల్లడి కావడంతో టాలీవుడ్ లో కలకలం రేగుతోంది. గతంలో పలువురు సినీ నటులు డ్రగ్స్ రాకెట్ లో అరెస్టైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News