: పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తే... 'ఏమంటున్నావ్ భయ్యా?' అన్న బాలీవుడ్ నటి!
సీనియర్ సినీ నటులకు సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్స్ పెరిగిపోతున్నాయి. పెళ్లయి ఓ పాప కూడా ఉన్న 42 ఏళ్ల టిస్కా చోప్రాకు ఈ మధ్యే ఓ అభిమాని పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజ్ చేస్తే..‘నేను పెళ్లికి రెడీ. వివరాలు పంపు. మా ఆయన కూడా ఎవరి కోసం నేను వెళుతున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ సమాధనం చెప్పి ఝలక్కిచ్చింది. తాజాగా ‘బాగ్ మిల్కా బాగ్’, ‘వీర్ జరా’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సీనియర్ నటి దివ్యాదత్తాను పెళ్లి చేసుకుంటానని అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఎవరికీ అర్థం కాని అతని ప్రతిపాదన ఎలా ఉందంటే...Divya Like you and I want to marry you very extraordinary amount Tume Hu Khus marry me I will swear (దివ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర చాలా డబ్బుంది. నువ్వు ఆనందంగా ఉంటావు. నిజం ఒట్టు) అన్నాడు. ఇంత గొప్ప 'ఇంగ్లీష్'ను అర్థం చేసుకోలేని దివ్యదత్తా 'ఏంటి భయ్యా... ఏమంటున్నావు.. కాస్త అర్థమయ్యేలా చెప్పు' అంది. దీంతో అతను ఆన్సర్ ఇవ్వలేదు కానీ, అతని ఇంగ్లిష్ పరిజ్ఞానంపై మిగతా వాళ్లు జోకులేస్తూ కామెంట్లు పెడుతున్నారు!