: హైదరాబాదులో మూడు నెలల క్రితం జరిగిన మరణానికి సంబంధించి బయపడ్డ సంచలన వీడియో!


హైదరాబాదులోని కర్మాన్ ఘాట్ లో మూడు నెలల క్రితం యాదగిరి అనే వ్యక్తి మృతి చెందిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. మృతుడు యాదగిరికి భార్య, నెలల బాబు ఉన్నారు. అయితే యాదగిరి బాత్రూంలో కిందపడి తలకు బలమైన గాయమై మృతి చెందాడని అతని భార్య అత్తమామలకు సమాచారం అందించింది. దీంతో కోడలి మాటలు విన్న యాదగిరి తల్లిదండ్రులు అతని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కోడలు పదేపదే తన కుమారుడు (యాదగిరి)కి చెందిన సెల్ ఫోన్ ఇమ్మని అత్తమామల్ని అడిగేది. అయినప్పటికీ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయని ఆ కుటుంబ సభ్యులు అదెక్కడ పెట్టారో మర్చిపోవడంతో ఆమెకు అందించలేకపోయారు. అనంతరం ఒకరోజు ఆ ఫోన్ ను గుర్తించడం జరిగింది. దానిని తన బంధువులకు చెందిన ఓ వ్యక్తి ఓపెన్ చేయడంతో షాకింగ్ వీడియో బయటపడింది. ఆ వీడియోలో యాదగిరి మంచంపై కొనఊపిరితో బట్టలు లేని స్థితిలో... 'నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాను... నన్ను చంపొద్దు జీవా, రాజేష్' అంటూ వేడుకోవడం... తన భార్యను గ్లాసుడు నీరివ్వమని కోరడం వినిపించింది. ఈ వీడియోను యాదగిరి భార్యే తీయడం విశేషం. ఈ వీడియో చూసిన యాదగిరి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే తన కోడలి వివాహేతర సంబంధంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ వీడియోను మీడియాలో ప్రదర్శించారు. ఈ ఘటనలో తన కోడలే నిందితురాలని వారు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News