: థియేటర్ యజమానులు పట్టువీడడం లేదు... కరణ్ జొహార్ కు తప్పని చిక్కులు


'యే దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. పాకిస్థాన్ నటీనటులు నటించడంతో సినిమా ప్రదర్శనను అనుమతించమని ఎమ్మెన్నెస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకో ప్రకటన చేస్తూ తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రమైన లాబీయింగ్ చేసిన కరణ్ జొహార్ ఎమ్మెన్నెస్ ను తన దారిలోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత రాజ్ ఠాక్రేతో సమావేశమై అతనిని ఒప్పించారు. దీంతో తన సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని ఆయన భావించారు. దీంతో థియేటర్ల యాజమానులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన సమాచారం పంపించారు. అయితే, వారు మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. తాము 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను ప్రదర్శించలేమని తెలిపారు. తొలుత ఎమ్మెన్నెస్ దీనినిపై ప్రకటనలు చేసినప్పటికీ తరువాత అది ప్రజా ఉద్యమమైందని, దర్శకుడితో ఆయన ఏం చర్చలు జరిపారో తమకు తెలియదని, అయినా ఇందులో పాక్ నటులుండడం వల్లే దీనిని నిషేధించామని స్పష్టం చేశారు. ఎవరు చెప్పినా తాము ఈ సినిమాను తమ థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేదని వారు స్పష్టం చేశారు. కాగా, 400 సింగిల్ థియేటర్ల యజమానులు ఈ సినిమా విడుదలకు అంగీకరించని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News