: థాయ్ కి బాయ్ చెప్పారు...ఇరానీ ఛాయ్ కూడా తాగేయండి: కబడ్డీ జట్టుకు సెహ్వాగ్ సూచన
క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడంలో ముందుండే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన ట్వీట్ తో అభిమానులను అలరించాడు. సెమీ ఫైనల్స్ లో థాయ్ లాండ్ జట్టును ఓడించి, ఫైనల్ చేరిన భారత కబడ్డీ జట్టుకు శుభాకాంక్షలు చెప్పాడు. 'మొత్తానికి థాయ్ కి బాయ్ చెప్పేశారు. రేపు తీరిగ్గా ఇరానీ ఛాయ్ తాగేసి కప్పును ఒడిసి పట్టుకోండి' అని సూచించాడు. ఈ ట్వీట్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దీనిని కబడ్డీ జట్టు ఆటగాళ్లు రీట్వీట్లు చేసుకుని మురిసిపోతుండగా, రాహుల్ చౌదరి 'వీరూ భాయ్ కి థ్యాంక్స్... మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయం' అని తెలిపాడు.