: విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం.. మహిళ కడుపులో కాటన్ పెట్టి కుట్టేసిన డాక్లర్లు
ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో వైద్యులు కాటన్ పెట్టి కుట్టేసిన ఘటన విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ప్రసవం అనంతరం మహిళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడం మొదలైంది. దీంతో ఆమె చికిత్స కోసం పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులోంచి కాటన్ను తొలగించారు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యంపై సదరు మహిళ బంధువులు మండిపడుతున్నారు.