: హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చితకబాదిన ఇంగ్లీష్ టీచర్.. తల్లిదండ్రుల ఆందోళన
హోంవర్క్ చేయలేదని విద్యార్థులను ఇంగ్లీష్ టీచర్ చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వడ్లం స్కూల్‌లో ఈ రోజు చోటుచేసుకుంది. తమ చిన్నారుల విషయంలో టీచర్ చర్యపై తల్లిదండ్రులు ఆందోళన తెలిపారు. స్కూల్ వద్దకు చేరుకొని టీచర్ తీరుకి నిరసనగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.