: ఒక్క సెకను లేటైనా ఘోరం జరిగిపోయేదే... ప్రాణాలకు తెగించిన రైల్వే ఉద్యోగి!


ప్రాణానికీ, మృత్యువుకీ మధ్య దూరాన్ని ఒక్క క్షణంలో పెంచేసిన ఘటన ఉత్కంఠ రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్న కొన్ని వీడియోలు తీవ్ర ఉత్కంఠను పెంచుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...ఎక్కడ జరిగిందో తెలియని ఓ ఘటనలో ఓ వ్యక్తి సైకిల్‌ తో రైలు పట్టాలు దాటుతూ సైకిల్ ను ట్రాక్‌ ఎక్కించలేక ట్రాక్ మధ్యలో పడిపోయాడు. సైకిల్ హ్యాండిల్ కి లగేజీ ఉండడంతో దానిని పైకెత్తలేక మరోసారి పడిపోయాడు. తర్వాత సైకిల్ ను ట్రాక్ దాటించాడు. సైకిల్ హ్యాండిల్ కు ఉన్న బ్యాగు కింద పడిపోవడంతో అందులోని వస్తువులన్నింటినీ తీసుకుని సంచిలో వేసుకుంటున్నాడు. ఇంతలో వెనకవైపు నుంచి రైలు వేగంగా దూసుకువచ్చేసింది. దానిని పట్టించుకోకుండా సామాన్లు ఏరుకుంటున్న ఆ వ్యక్తిని అదే ట్రాక్ వద్ద పని చేస్తున్న గ్యాంగ్ మెన్ చూశాడు. క్షణం ఆలస్యం చేయకుండా పరుగెత్తుకు వచ్చి అతనిని అమాంతం ఢీ కొట్టి ట్రాక్ నుంచి బయటకు తోసుకుంటూ బయటపడ్డాడు. ఆ సమయంలో ఒక్క సెకను ఆలస్యమైనా రైలు వారి మీదుగా దూసుకుపోయేదే. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అయితే ఇది కల్పిత వీడియో అని ఆరోపిస్తున్నప్పటికీ వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూడండి.

  • Loading...

More Telugu News