: ప్రజలకు బహిరంగ లేఖ రాసిన వరుణ్ గాంధీ


రక్షణ రంగ రహస్యాలను అమ్ముకుంటున్నాడన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ దేశప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. రక్షణ రంగ రహస్యాలను లీక్‌ చేశానంటూ తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. అసలు ఎడ్మండ్స్‌ అలెన్‌ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తానెప్పుడూ అతడిని కలవలేదని తెలిపారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించాలని చూసే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. హనీ ట్రాప్ లో చిక్కుకున్న వరుణ్ గాంధీ కీలకమైన రక్షణ రంగ రహస్యాలను ప్రత్యర్థులకు విక్రయించారని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఎడ్మండ్స్‌ అలెన్‌ అనే న్యాయవాది భారత ప్రధాని నరేంద్ర మోదీకి గత నెలలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ బట్టబయలు కావడంతో వరుణ్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News