: బ్యాంకుల తీరుపై మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహం.. ఆర్బీఐకి ఫిర్యాదు చేశామని వ్యాఖ్య‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లాలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని అన్నారు. బ్యాంకులను జాతీయం చేసింది వాటి లాభాల కోసం కాదని ఆయ‌న అన్నారు. ప్రజల కోసమేన‌ని వాటిని జాతీయం చేశార‌ని, అందుకు అనుగుణంగా బ్యాంకులు వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. బ్యాంకుల‌ తీరుపై ఆర్బీఐకి ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని చెప్పారు. రైతుల‌కు నిర్దేశించిన మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిందేన‌ని అన్నారు.

  • Loading...

More Telugu News