: ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 15 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడిన సిబ్బంది


ఇటీవ‌ల భువ‌నేశ్వ‌ర్‌లోని ఓ ఆసుప‌త్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 24 మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే ఢిల్లీలోని గురు తేగ్‌ బహదూర్ ఆసుపత్రిలో ఈ రోజు అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఆసుపత్రిలోని పిల్లల విభాగంలో మంట‌లు వ్యాపించాయి. వెంట‌నే ఆసుప‌త్రి సిబ్బంది అప్ర‌మ‌త్తం కావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. దాదాపు 15 మంది చిన్నారులను సిబ్బంది ర‌క్షించారు. ఆసుప‌త్రికి ఏడు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. వెంటిలేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్ర‌మాదం సంభ‌వించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలపై స్పందించిన కేంద్ర‌ ఆరోగ్యశాఖ.. ఆసుప‌త్రుల్లో అటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా స‌మ‌ర్థ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News