: బద్దలైన సచిన్, ద్రావిడ్ ల రికార్డు


క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డు బద్దలైంది. 35 సంవత్సరాల వయసు దాటిన తర్వాత టెస్ట్ క్రికెట్లో వీరిద్దరూ తమ కెరీర్లో చెరో 12 సెంచరీలు నమోదు చేశారు. వీరితో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్, పాకిస్థాన్ క్రికెటర్ కూడా 35 ఏళ్లు దాటిన తర్వాత 12 సెంచరీలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. అయితే, తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో యూనిస్ ఖాన్ మరో సెంచరీ చేశాడు. దీంతో, 35 ఏళ్ల వయసు తర్వాత అత్యధిక సెంచరీలు (13) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యూనిస్ ఖాన్ వయసు 39 ఏళ్లు. వచ్చే నెలలో పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.

  • Loading...

More Telugu News