: జయలలితను పరామర్శించిన సుజనాచౌదరి, మురళీమోహన్, సీఎం రమేశ్
నెల రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆమె పరిస్థితి మెరుగుపడిందని ప్రకటించడంతో ఈ రోజు కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు మురళీమోహన్, సీఎం రమేశ్‌లు చెన్నైకు వెళ్లి ఆసుపత్రిలో ఆమెను పరామర్శించారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత ఆరోగ్యం 95 శాతం మెరుగుపడిందని తమకు వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. జయలలిత పదిరోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తమకు వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు.