: మరోసారి అపోలో ఆసుపత్రికి వెళ్లి జ‌య‌ల‌లిత‌ను ప‌రామ‌ర్శించిన త‌మిళ‌నాడు తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు


చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో నెలరోజులుగా చికిత్స తీసుకుంటున్న‌ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి మ‌రో వారం రోజుల్లో డిశ్చార్జయ్యే అవకాశముందని అన్నాడీఎంకే నిన్న‌ వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ఈ రోజు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి మ‌రోసారి వెళ్లారు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న జ‌య‌ల‌లిత‌ను ప‌రామ‌ర్శించారు. జ‌య‌ల‌లిత మాట్లాడుతున్నార‌ని, ప్ర‌స్తుతం ఆమెకు కృత్రిమ శ్వాసతో పాటు, ఫిజియో థెరపీని కొనసాగిస్తున్నట్లు వైద్యులు బులిటెన్ కూడా విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే.

  • Loading...

More Telugu News